Wednesday, January 22, 2025

27న రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపిఒ

- Advertisement -
- Advertisement -

Rainbow Children's Medicare IPO on 27th

హైదరాబాద్ : మల్టీ-స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపిఒ ఈనెల 27న ప్రారంభం కానుంది. సంస్థ ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించింది. రూ.1581 కోట్ల ఈ ఇష్యూకి ఒక్కో షేరుకు రూ.516-542 ధరను నిర్ణయించారు. ఈ ఇష్యూ వచ్చే వారం ఏప్రిల్ 27న ప్రారంభమై 29వ తేదీ రోజు ముగుస్తుంది. ఇది ఏప్రిల్ 26న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ప్రారంభిస్తారు. ఒఎఫ్‌ఎస్ కింద ప్రమోటర్లు రమేష్ కంచర్ల, దినేష్ కుమార్ చిర్ల, ఆదర్శ్ కంచర్ల, ప్రమోటర్ గ్రూప్ ఎంటిటి పద్మ కంచర్ల, పెట్టుబడిదారులు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్, సిడిసి ఇండియా షేర్లను విక్రయిస్తాయి. ఐపిఒ కోసం పెట్టుబడిదారులు 27 షేర్ల లాట్‌కు రూ.14,634 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News