Monday, December 23, 2024

జోరుగా… హుషారుగా

- Advertisement -
- Advertisement -

చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ’టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈనెల 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి ’రెయిన్ బో’ అనే పాట విడుదలైంది. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. నాయకానాయికలు కారులో వెళ్తూ దారిలో కలిసిన వారితో సరదాగా గడుపుతున్నట్లుగా పాట చిత్రీకరణ సాగింది. సిద్ధార్థ్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News