Friday, November 22, 2024

జల జీవనం

- Advertisement -
- Advertisement -

Rainfall averages 20 cm in 24 hours in telangana

కుండపోత వర్షానికి పలు జిల్లాల్లో కాలనీల మునక

లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుక కరువు ఎప్పటికప్పుడు సురక్షిత
ప్రాంతాలకు తరలింపు నిజామాబాద్ జిల్లాలో నదిలో గల్లంతైన బాలిక రాజన్న సిరిసిల్ల
జిల్లా మానేరు వాగులో చిక్కుకుపోయిన గొర్రెల కాపరి, బోటు సాయంతో కాపాడిన పోలీసులు
గంభీరావుపేట శివారు మానేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్‌టిసి బస్సు వరదలో
చిక్కుకున్న బస్సును జెసిబితో తీయడానికి విఫలయత్నం మూసీ నదిలో కొట్టుకుపోయిన
కారు కారు నడుపుతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు మోయు తుమ్మెద వాగు పరవళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో 4రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో సగటున 20 సెం టీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో జనజీవ నం స్తంభించింది. భారీ వర్షాలకు వికారాబాద్, వ రంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాలు వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్నా యి. వర్షాలకు పలు జిల్లాల్లో కాలనీలు నీటమునిగాయి. అల్పపీడనం ప్రభావంతో ఉమ ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండగా, ఎగువను న్న మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండాకు రుస్తున్న కారణంగా జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీ గా వరదనీరు చేరడంతో నిండుకుండలా తలపిస్తున్నాయి.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు

రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపిలే ని వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీ ద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వానల వ ల్ల పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా యి. వరద ఉద్ధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా వాగులు దాటే ప్రయత్నా లు చేసి పలువురు ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. వరద నీ టిలో చిక్కుకున్న ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బాలిక గల్లంతు..

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి వెల్లిన బాలిక నదిలో గల్లంతైంది. గోదావరి నది వద్ద ప్రీతి అనే బాలిక బట్టలు ఉతికి స్నానం చే స్తుండగా కాలుజారి పడిపోయింది. గోదావరిలో కొట్టుకుపోతున్న కూతురిని కాపాడుకోవడానికి ఎ ంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింద ని తల్లి సుశీల ఆవేదన వ్యక్తం చేసింది. ప్రీతి స్థానిక జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

దాదాపు 40 నుంచి 50 గొర్రెలు

రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగులో ఓ గొర్రెల కాపరి చిక్కుకుపోయాడు. సిరిసిల్ల పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి అనే కాపరి… తన దగ్గరున్న గొర్రెలను మేపేందుకు సోమవారం మానేరు వాగు ప్రాంతానికి వెళ్లాడు. నెహ్రూనగర్ చెక్‌డ్యాం వద్ద వాగు మధ్యలో ఉన్న గట్టు ప్రాంతంలో పచ్చిక బయళ్లను గమనించిన చంద్రమౌళి గొర్రెలను తోలుకువెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో వాగు పొంగి గట్టు చుట్టూ నీరు అలుముకుంది. దాదాపు 40 నుంచి 50 గొర్రెలతో సహా చంద్రమౌళి అక్కడే చిక్కుకుపోయారు. వరద తక్కువగా ఉన్న సమయంలో ప్రాణంగా చూసుకుంటున్న మూగజీవాలను వదిలివచ్చేందుకు మనసొప్పక అతను అక్కడే ఉండిపోయాడు. చూస్తూండగానే వరద ప్రవాహం పెరిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు కాపరిని కాపాడేందుకు ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బోటు సాయంతో గొర్రెల కాపరిని రక్షించారు.

కొట్టుకుపోయిన బస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును మంగళవారం జేసిబి సాయంతో తీయడానికి ప్రయత్నించారు. కాగా వరద ఉధృతి పెరగడంతో మరుసటి రోజుకు ప్రయత్నాన్ని వాయిదా వేశారు. మంగళవారం ఉదయం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయింది.

వ్యక్తి నిర్లక్షం 100 మీటర్లు కొట్టుకుపోయిన కారు

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం చించల్‌పేట్ గ్రామంలోని మూసీనదిలో మంగళవారం కారు కొట్టుకుపోయింది. మూసీవాగు ఉప్పొంగుతుందని చెప్పినా వినకుండా వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ప్రకాశ్ తన కారుతో మూసీ వాగు దాటే ప్రయత్నం చేశాడు. ఈ సంఘనటలో వాగు మధ్యలో చిక్కుకున్న అతని కారు 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికుల ప్రకాశ్ కాపాడారు. ఈ ఘటనలో కారు మొత్తం డ్యామేజ్ అయ్యిందని స్థానికులు తెలిపారు.

వరదముంపులో ఓరుగల్లు

వర్షాలు వరంగల్ వాసులకు మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హంటర్ రోడ్డులోని బృందావన కాలనీ, ఎన్టీఆర్‌నగర్, సంతోషిమాత నగర్ కాలనీల్లో వరదనీరు నిలిచింది. కట్టమల్లన్న చెరువు నుంచి వరదనీరు పెద్ద ఎత్తున రావడంతో శివనగర్, ఎనుమాముల లక్ష్మీ గణపతి కాలనీ, సాయినగర్, మధుర నగర్ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఖమ్మం బైపాస్ రోడ్డులోని రాజీవ్‌కాలనీ పూర్తిగా నీట మునగడంతో వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది బాధితులను హంటర్ రోడ్డులోని సంతోషిమాత గార్డెన్‌కు తరలించారు. నీట మునిగిన కాలనీవాసులకు వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అక్షయపాత్ర ద్వారా భోజనం అందిస్తున్నారు.

పరవళ్లు తొక్కుతోన్న మోయ తుమ్మెద వాగు..

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మోయ తుమ్మెద వాగు పరవళ్లు తొక్కుతుండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. హన్మకొండ టు -సిద్దిపేట ప్రధాన రహదారిపై బస్వాపూర్ వద్ద కల్వర్టు పైనుంచి ఈ వాగు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోహెడ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఇందుర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వింజపల్లి, వరికోలు ప్రాంతంలోని రెండు కుంటలు ప్రవహించడం వల్ల వరికోలు, రాంచంద్రపూర్, ఎర్రగుంటపల్లి, సామార్లపల్లి నుంచి కోహెడ, వింజపల్లి నుంచి పైగ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది.

వర్షం ధాటికి వైకుంఠధామం జలదిగ్బంధం

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతె మండలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పోస్తున్నాయి. నామవారం పెద్ద చెరువు మత్తిడి పోయడంతో నామవారం టు -గుంజలూరు ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మావిళ్లగూడెంలో వర్షం దాటికి వైకుంఠధామం జల దిగ్బంధం అయింది. విభలపురం వద్ద గండ్ల చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. రాఘవపురం వద్ద ఎస్సారెస్పీ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఇళ్లలోకి వరద నీరు

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుబీర్ మండల కేంద్రంలోని మేదరివాడ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను గ్రామ పంచాయతీకి తరలించారు. వారికి రాత్రి అక్కడే బస ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. రైతులు సాగు చేసిన పత్తి, సోయా, మినుము, పెసర వంటి పంటలు పూర్తిగా నీటమునిగాయి. ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాఠశాలల ప్రాంగణంలోకి నీరు..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటవీ శాఖ కార్యాలయం ఎదుట భారీగా నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. బస్టాండ్‌లో నీరు నిల్వడంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా కొన్ని పాఠశాలల ప్రాంగణంలో మళ్లీ నీరు చేరింది.

మత్తడి పోస్తున్న సోమాజి చెరువు

మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. నిజాంపేట మండలంలో సోమాజి చెరువు మత్తడి పోస్తోంది. చల్మెడ నుంచి నిజాంపేట వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట తహసీల్దార్, అగ్నిమాపక కేంద్రం కార్యాలయాలు జలమయం అయ్యాయి.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు నిండుకుండలా….

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే దశకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. దర్పల్లి, భీంగల్, తిరుకొండ ప్రాంతాల్లో మొదలయ్యే అన్ని ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో రోడ్లపై పారుతున్నాయి.

సమద్రమట్టానికి 4.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం

రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి భారీ మోస్తరు వర్షాలు కురస్తాయని వాతావారణ కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడిందని అయితే దానికి అనుబంధంగా సమద్రమట్టానికి 4.5 కి.మి. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్‌లో భారీ వర్షం….

నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News