- Advertisement -
హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా మారుతున్నాయి. మరోవైపు తూర్పు గాలులు కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాగల మూడు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 42గంటల్లో పలు చోట్లు ఉరుములు ,మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. కోదాడలో 11.8 మి.మి , చిల్కూరులో 6.2, ములకలపల్లిలో 5.2, నూతన్‌కల్‌లో 1.8, మి.మి వర్షం కురిసింది. మర్రిగడ్డ , అశ్వారావుపేట, బూర్గంపహడ్, ఎన్కూరు, హుజుర్‌నగర్, నల్గొండ, శాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో తుంపర్లు పడ్డట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Advertisement -