- Advertisement -
తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రము తో పాటు అన్ని గ్రామాలలో రాత్రి కురిసిన వడగండ్ల వానకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మామిడి పండ్ల తోటలు బాగా దెబ్బ తిన్నాయి. పొట్ట కొచ్చిన వరి పంటకు రాళ్ల వర్షంతో బాగా నష్టం వాటిల్లింది. తిరుమలగిరి-తొర్రూరు ప్రధాన రహదారిపై రోడ్డు పై చెట్లూ కూలడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెట్రోల్ బంకు పక్కన చెట్టు కార్లపై పడడంతో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ పరిది లోని నెల్లిబండ తండాలో గోడ కూలీ 20 గొర్రెలు మృతి చెందాయి. జనగాం -సూర్యాపేట ప్రధాన రహదారిపై హార్డింగ్ కూలడంతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది.
- Advertisement -