Thursday, December 19, 2024

చల్లబడ్డ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రోళ్లు పగిలే ఎం డలు..చాచికొట్టినవడగాల్పులు ఉక్కపోతలతో గత పదిరోజులుగా ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ చల్లబడింది. రాష్ట్రమంతటా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు మండవేసవి నుంచి ఉపశమనం క ల్పించాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత గా 47.8డిడ్రీలకు చేరుకున్న రికార్డు స్థాయి ఉష్ట్రగ్రతలు కూడా ఒక్క వర్షంతోనే 5డిగ్రీలకు తగ్గిపోయి సాధారణ స్థాయికి చేరువయ్యాయి. రాష్ట్రం లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రా ష్ట్రంలో బుధవారం ఉష్ణోగ్రతలు గరిష్టంగా నిజామాబాద్ జిల్లా జకారంలో 42.9డిగ్రీలు నమోదయ్యాయి.నిర్మల్ జిల్లా నర్సాపూర్,సాలూర,త నూ ర్,మసోరా పెరకిట్, మార్తోడ, జగిత్యాల జిల్లా గో ధూర్,తదితర ప్రాంతాలలో 42.5డిగ్రీలమేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటున 40డిగ్రీ లు రికార్డైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వేసవిలో రోటీన్‌గా వాతావరణ కేంద్రం నుంచి వె లువడే అధిక ఉష్ణోగ్రతలు , వడగాల్పులకు సంబంధించిన సూచనలు , హెచ్చరికలు కూడా నిలిపివేశారు. ఆ స్థానంలో ఈదురుగాలులు , అకాల వర్షాలు వడగళ్ల వానలకు సం బంధించిన సూచనలు చోటు చేసుకున్నాయి.

ఒక్క వానతోనే రాష్ట్రమంత టా వాతవరణ పరిస్థితులు మారిపోయాయి. తూ ర్పు విదర్భ నుండి తెలంగా ణ, రాయలసీమ ,దక్షిణఅంతర్గత కర్ణాటక మీదు గా దక్షిణ తమిళనాడు వరకూ కొనసాగిన ద్రోణి బుధవారం ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్య మహారాష్ట్ర ,ఉత్తర అతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ దిశ నుండి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మారిన తాజా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాగల మూడు రోజులకు ప్రత్యేక వాతావరణ బలిటిన్‌ను విడుదల చేసింది. ఎల్లుండి వరకూ తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 40నుండి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

ఈ నెల 14వరకూ ఇదే విధమైన వాతావరణ నెలకొంటుందని తెలిపింది.రాగల 24గంటలకు సంబంధించి ఏడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారబాద్ ,సంగారెడ్డి,మెదక్ , నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. మరో పది జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రత్యేక బిలిటిన్ విడుదల :
మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాలకు ప్రత్యేక వెదర్ బిలిటిన్ విడుదల చేసింది. రాగల 24గంటల పాటు సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉరుములు , మెరుపులతో కూడి జల్లులు కురిసే అవాకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37డిగ్రీలు , కనిష్టంగా 24డిగ్రీలు ,గాలి వేగం గంటకు 10నుండి 40కిలోమీటర్ల వరకూ వీచే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత రాగల 48 గంటల్లో కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతమై వుంటుంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం , ఉరుములతో కూడిన జల్లులు కురిఏ అవకాశం ఉంటుందని వెల్లడించింది.
బికనూర్‌లో 32.5మి.మి వర్షం
రాష్ట్రంలో బుధవారం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బికనూర్‌లో 32.5 మి.మి , దోమకొండలో 21మి.మి వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా జరాసంధలో 26.5, సిద్దిపేట జిల్లా కట్కూర్‌లో 12.8 మి.మి వర్షం కురిసింది. వికారబాద్, నిజామాబాద్, పెద్దపల్లి,ములుగు తదితర జిల్లాల్లో కూడ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి.

అకాల వర్షాలు పంటనష్టాలపై అంచనాలు:
అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పైర్లు నేలకొరిగాయి.పైరు మీద ఉన్న ధాన్యం నేల రాలింది. కొతకోసి ఆరబెట్టిన దాన్యం కూడా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కూడా తడిసి పోయింది. మామిడి , బొప్పాయి తదితర పండ్లతోటకు కూడా నష్టం వాటిల్లింది. అకాల వర్షాలు వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టాలపై అంచనాలు వేసి నివేదికలు సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంతే కాకుండా తడిసిన ధాన్యం వల్ల నష్ణపోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. కనీస మద్దతు ధరలకే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రైతులకు భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News