Thursday, January 23, 2025

తడిసి ముద్దయిన రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో ఈసీ, మూసీ నదులకు పోటెత్తిన వరద
ఈనెల 24వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 12.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : పలు జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఈనెల 24వరకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబా ద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈసీ, మూసీ నదులకు భారీగా వరద పోటెత్తింది. వరదలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, చేవెళ్ల మండలం తంగేడుపల్లి వద్ద వరద ఉధృతికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు….

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వానలు దంచికొట్టగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ జంట నగరాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 12.9 సెంటిమీటర్లు, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో 12.5 సెంటిమీటర్లు, సుల్తాన్‌పూర్‌లో 12.3, కుమురంభీం గిన్నెదరిలో 11.4, కరీంనగర్ చిగురుమామిడిలో 14, హనుమకొండ జిల్లా వేలార్‌లో 12, వరంగల్ జిల్లా మంగళవారిపేటలో 11.3, మంచిర్యాల జిల్లా శాంతాపూర్‌లో 10.7, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 10.7, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 10.4, భద్రాద్రి కొత్తగూడెం కర్కగూడెంలో 10.3, సంగారెడ్డి జిల్లా కందిలో 10.2, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనాలో 10.8, నిజామాబాద్ జిల్లా మాచెర్లలో 10.2, సంగారెడ్డి జిల్లాలో రుద్రారంలో 10.2, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 10.2, జనగామ జిల్లా మల్కాపూర్‌లో 10.1, కరీంనగర్ జిల్లా వెంకెపల్లిలో 10.1, జనగామ జిల్లా తాటికొండలో 10 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, చాలా జిల్లాలో రెండు నుంచి పది సెంటిమీటర్ల వర్షపాతం రికార్డయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News