Wednesday, January 22, 2025

మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains across telangana next four days

చల్లని కబురు మోసుకొచ్చిన వాతావరణ శాఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. భానుడి ప్రతాపంతో, వేడిగాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే ప్రజలకు ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించినట్లయ్యింది. అయితే ఈ నాలుగు రోజులు కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆకాశమంతా మేఘావృతమై ఉండడంతో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25వ తేదీ వరకు దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News