- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణం శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించనుండడంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటుసముద్ర మట్టం నుంచి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో) వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.
- Advertisement -