Friday, December 20, 2024

రాష్ట్రమంతటా వర్షాలు.. భద్రాచలంలో కుండపోత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో ఆదిలాబాద్ , కుమరంభీం, మంచిర్యాల ,నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం , సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మంగళవారం భద్రాచలంలో కుండపోత వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షం ధాటికి భద్రాద్రి ఆలయ పరిసరలు తడిసిముద్దయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News