మరో రెండు రోజుల పాటు చిరుజల్లులు కురిసే అవకాశం
అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. సోమాజీగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, సనత్‌నగర్, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొంపల్లి, చింతల్, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, సూరారంలో ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వెంటనే అప్రమత్తమయిన జిహెచ్‌ఎంసీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గత అర్థరాత్రి కూడా నగరంలో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహరాష్ట్ర వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్షేత్రస్థాయిలో డిఆర్‌ఎఫ్ టీమ్స్‌ను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిమీ నుంచి 3.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శుక్రవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయని, శని ఓమోస్తారు వర్షం ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీల వరకు
ఉత్తర కోస్తా తీరం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 1.5 కిమీ నుండి 3.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని, దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, నిజామాబాద్ జిల్లాలో 22 మిల్లీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరిలో 17.8, జోగులాంబ గద్వాల్‌లో 10.3, హైదరాబాద్‌లో 7.5, యాదాద్రి భువనగిరిలో 7, నిర్మల్‌లో 5.3, నాగర్‌కర్నూల్‌లో 5.3, వరంగల్ రూరల్‌లో 49.5 ములుగులో 25.5, జయశంకర్ భూపాలపల్లిలో 11.5, ఆదిలాబాద్‌లో 10.8, మహబూబాబాద్‌లో 9.8, వరంగల్ అర్భన్‌లో 7.3, కరీంనగర్‌లో 7, సిద్ధిపేటలో 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.