హైదరాబాద్: లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల దూరంలో తౌక్టే తుపాను కేంద్రీకృతమైందని, రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని, మే 18న మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య గుజరాత్ వద్ద తౌక్టే తుపాను తీరం దాటవచ్చిన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, విదర్భ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడవచ్చని హైదరాబాద్ వాతావారణ శాఖ పేర్కొంది.
Rains expected in Telangana for next 2 days