- Advertisement -
రాష్ట్రంలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.కింది స్థాయి గాలులు పశ్చిమ ,వాయువ్య దశలనుండి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. దీంతో బుధ , గురు వారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ప్రత్యేక బులిటిన్ విడుదల చేసింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. రాత్రి సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి చినుకులు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉష్ణగ్రతలు గరిష్టంగా 31డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Advertisement -