Thursday, January 23, 2025

మండుతున్న ఎండలు: మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోత్నున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దక్షిణ తెలంగాణ , సెంట్రల్ తెలంగాణ ప్రాంతం కంటే ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత అధికంగావుంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా నిడమనూర్‌లో 46.1డిగ్రీలు నమోదయ్యాయి. మిగిలిన మరికొన్ని జిల్లాల్లోనూ 45డిగ్రీలు దాటేశాయి. దామచర్లలో 45.6,బయ్యారంలో 45.5, తంగుల్లలో 45.5, కేతేపల్లిలో 45.3, తడ్వాయ్‌లో 45.2, శ్రీరాంపూర్‌లో 45.2, గార్లలో 45.2,కూసుమంచిలో 45.1, ఖానాపూర్‌లో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గంటకు 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని , ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. అశ్వారావుపేటలో 25మి.మి. వాన్కిడిలో 20, సర్దానలో 15, గాధారిలో 14.5, జిన్నారంలో 13.5, బెల్లాల్‌లో 11.3 , వాడిలో 11, గ్రేటర్ పరిధిలోని షేక్‌పేట, బంజారాహిల్స్ ,అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో 9మి.మి వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తుంపర్లు రాలాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News