ఎండల నుంచి త్వరలో పూర్తి ఉపశమనం
హైదరాబాద్: వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని ఎదురుచూస్తున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మే చివరి నుంచి జూన్ 5వ తారీఖు తర్వాత తొలకరి జల్లులు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా మే అంతా ఎండలు కాసిన తర్వాత, జూన్ 5 నుంచి తొలకరి జల్లులు పలకరిస్తాయని, విస్తారంగా వర్షాలు పడతాయని చెబుతున్నారు. అలాగే ఈ మాసం తర్వాత కొన్ని వాతావరణ పరిస్థితులు, ప్రభావాలతో ఎక్కువ వర్షపాతం నమోదు కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎండలు బాగా పెరిగి జనం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే వానాకాలం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వేసవి ఈసారి ఏప్రిల్ లోనే తీవ్రస్థాయిలో ప్రతాపం చూపించడంతో ప్రజలు అల్లాడిపోయారు. అలాగే మే నెలలో కూడా ఇదే విధంగా భానుడు ప్రతాపం చూపిస్తాడని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే మే తర్వాత అంటే మే 31 తర్వాత తొలకరి జల్లులు రాష్ట్రాన్ని పలకరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.