Tuesday, December 24, 2024

ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు: ఐఎండి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 24నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 24, 25తేదిల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇంటీరియర్ తమిళనాడు నుండి ద్రోణి తమిళనాడు, రాయల సీమ, తెలంగాణ, విదర్భల మీదుగా ఈశాన్య మధ్యప్రదేశ్ వరకూ సగటు సముద్ర మట్టం నుండి 0.9కి.మి ఎత్తు వద్ద కొనసాగుతున్నట్టు తెలిపింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News