Wednesday, January 22, 2025

నగరంలో వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. దీంతో సాయంత్రానికి వాతావరణం మరింత చల్లబడింది. బేగంపేట్, సికింద్రాబాద్ బాలానగర్ పరిసర ప్రాంతాలతో పాటు అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది.

ఇదేక్రమంలో బుధవారం సైతం నగరంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదుర గాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షం కారణంగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలోపే నమోదు అయ్యే అవకాశాలున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News