Monday, December 23, 2024

రేపు, ఎల్లుండి ఈదురుగాలులతో కూడిన వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains in next two days in telangana

హైదరాబాద్: ఉపరితల ద్రోణి దృష్ట్యా రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. నేడు, రేపు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News