Monday, January 20, 2025

నేడు వర్షాలు..16నుంచి మండే ఎండలు!

- Advertisement -
- Advertisement -

వేసవి రాకముందే వాతావరణంలో వేడి పెరుగుతోంది. ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు మోసుకొచ్చింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం చెదురు మదురు వర్షాలు కురిశాయి.

కాగా ఈ నెల 16నుంచి ఎండలు పెరగవచ్చని అంచనా. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆదివారంనాడు చార్మినార్ ప్రాంతంలో 34.6 డిగ్రీల సెల్సియస్, అమీర్ పేట ప్రాంతంలో 36.2 డిగ్రీలు, మోండామార్కెట్ ప్రాంతంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News