Thursday, April 10, 2025

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. 40Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

భూపాలపల్లి, గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మోస్తరు వర్షం కురిసింది. పలుజిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News