- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జనాలు బయటికి రావడానికి భయపడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలోని అదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
- Advertisement -