Sunday, December 22, 2024

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులు అయినా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలడంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

కాగా.. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల మోస్తరు వానలు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News