హైదరాబాద్: నగరాన్ని తొలికరి చినుకులు పలకరించాయి. వర్షకాలం ప్రవేశంతో గత 10 రోజులుగా వర్షాల కోసం ఎదరు చూపులు బుధవారం తీరాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిరు జల్లులు పడ్డాయి. దీంతో గత వారం రోజులుగా ఎండ వేడిమి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాస్తా ఉపశమనం లభించింది. ఉదయం నుంచి మధ్యాహ్నాం 4 గంటల వరకు ఎండ మండిపోగా, సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా హైదరాబాద్‌ను మేఘాలు ఆవహించారు.
నగర వ్యాప్తంగా దట్టంగా మబ్బులు అలుపుకోవడంతో వాతావరణం పూర్తిగా మారిపోయి పూర్తిగా చల్లబడి వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతువపనాలు చురుగా కదులుతుండడంతో విజయవాడ తదితర ప్రాంతాల్లో ఇప్పటీకే భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోకి సైతం రుతు పవనాలు ప్రవేశంతో హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది.
రామచంద్రపురం సర్కిల్‌లో పలు ప్రాంతాల్లో 3.6 సె.మి.లకు పైగా వర్షం కురువగా, తిరుమల్‌గిరిలో 3.1, గచ్చిబౌలిలో 2.7, లింగంపల్లిలో 2.6, రాయదుర్గులో 2.5, చంద్రనగర్ 2.3, మల్లాపూర్ 2.1, కాజాగూడ 1.9 సె.మి. వర్షం కురిసింది. అదేవిధంగా గోల్కొండ, మెహదీపట్నం, షేక్‌పేట్, ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ముషీరాబాద్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్ నారాయణగూడ, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి ఆసీఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో సైతం భారీ వర్షం పడింది.