Friday, April 4, 2025

ఉరుములు మెరుపులతో వర్షాలు..ఐఎండి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర ,మధ్య , పశ్చిమ జిల్లాలలో ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా భువనగరి మండలం నందనంలో 11.3 మి.మి వర్షం కురిసింది. పడమటి కేశవాపురంలో 11.3, సరూర్‌నగర్ అలకాపురిలో 10.5, చార్మినార్‌లో 10.3, బండ్లగూడలో 10, రాజేంద్రనగర్‌లో 9.5మి.మి చోప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News