Thursday, January 23, 2025

రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఝార్ఖండ్ పరిసరాలలో ఉన్న పశ్చిమ ద్రోణి బలహీనపడినట్టు తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్టం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

శనివారం రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.5 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మల్లంపల్లిలో 39.8, లక్ష్మిసాగర్‌లో 39, రామలక్ష్మణ పల్లిలో 37.8, వెదురుగట్టులో 37, పోచంపల్లిలో 33.5, తాడ్వాయ్‌లో 30.3, రేగొండలో 29.5, గుమ్మడిదలలో 29, కొల్లూరులో 27,పెద్దమందడిలో 25. మి.మి చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా తేలిక పాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News