- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ ఆదివారం ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశముందిని పేర్కొంది. తోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది సాధారణ పరిస్థితులకంటే ఎంతో ముందుగానే కృష్ణానది పరివాహకంగా ఎగువ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -