Wednesday, January 22, 2025

వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం

- Advertisement -
- Advertisement -

హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు
రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో
ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు
ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం
అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే
ప్రమాదం వరి కోతల వాయిదా మంచిదంటున్న
అధికారులు టార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచుకోవాలి
ఆరుబయట ధాన్యం ఆరబెట్టొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఒక వైపు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 45డిగ్రీలకు చేరవలో ఉన్న పగటి ఉష్ణొగ్రతలు ఒక్కసారిగా 41.5డిగ్రీలకు పడిపోయాయి. కేవలం 24గంటల వ్యవధిలోనే ఏకంగా మూడు డిగ్రీలు తగ్గిపోయాయి. మరో వైపు రా్రష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. తెలు గు ప్రజల తొలి పండగ ఉగాది సందర్భంగా వాతావరణ శాఖ ప్రజలకు చల్లటి కబురందించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కో స్తా నుం చి దక్షిణ తమిళనాడు వరకూ రాయల సీమ మీదుగా ఉ పరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల నాలుగు రో జులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.మంగళవారం నుంచి రాగల మూడు రోజులు, పల్లు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూ డిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఈనెల ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎం డలతో జనం అల్లాడిపోతున్నారు.

ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన చల్లటి వార్త ఉక్కపోతకు గురవుతూ వస్తున్న ప్రజలను హాయిగా సేదతీరేలా చేసింది. రాగల 24గంటల్లో పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్ఫష్టం చేసింది. ఈ నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. సోమవారం రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని పేర్కొంది. భద్రాద్రి కొ త్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది.

సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని గద్వాలలో 41.4, తాతినేనిదొడ్డిలో 41.3,దరూర్‌లో 41.1 డిగ్రీలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లా దగడలో 41.4, వెలిగొండలో 41.3, కోనాయ్‌పల్లిలో 41.3డిగ్రీలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా జానంపేటలో 41.4, అడ్డాకల్‌లో 41.2డిగ్రీలు నమోదయ్యా యి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 41నుంచి ఆలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం వరకూ సెగలు చిమ్మిన ఉత్తర తెలంగాణ ప్రాంతం కొంత చల్లబడింది.

వ్యవసాయరంగం అప్రమత్తం!
రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో వ్యవసాయరంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలు ఇప్పడిప్పుడే కోత దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో వరికోతల పనులు కూడా జరుగుతున్నాయి.శెనగ, మినుము, పెసర తదితర పప్పుధాన్య పంటలు కూడా చివరిదశకు చేరుకున్నాయి. ఉగాది పండగ తర్వాత కోత పనులు ప్రారంభించాని భావిస్తున్న తరుణంలో వాతావరణంలో మార్పులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.కోత దశలో ఉన్న పంట అకాల వర్షాలకు నేల పాలుకాకుండా తగి న జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా వరి కోతల పనులు వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం కుప్పలు తడి సి పోకుండా టార్పాలిన్లు సిద్దంగా ఉంచుకోవాల ని, అదే విధంగా ఆరుబయట ధాన్యం ఆరబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News