Sunday, December 22, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌ నగర్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News