Saturday, April 5, 2025

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని.. అలాగే, మరికొన్ని చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ, మధ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, నిన్న హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాదారులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు.పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News