Monday, April 7, 2025

అలర్ట్.. తెలంగాణలో మరో రెండ్రోజులు వానలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ద్రోణి కారణంగా రేపు, ఎల్లుండి రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. రేపు(సోమవారం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక, ఎల్లుండి సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

కాగా, గత రెండు మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక, హైదరాబాద్ లో రెండు గంటలపాటు కుండపోత వాన పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోసారి వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేయడంతో పలు ప్రాంతాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News