- Advertisement -
హైదరాబాద్: తెలంగాణకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ కేంద్రం(ఐఎండి). ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపిందే. అయితే, మధ్యాహం మాత్రం ఎండలు దంచి కొడుతాయని.. సాయంత్రం వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇప్పటికే గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడుతున్న సంగతి తెలిసిందే.
మరో రెండు రోజులు.. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జిలాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. పిడిగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
- Advertisement -