Thursday, November 14, 2024

తెలంగాణకు ఉరుములు మెరుపులతో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుండి మరట్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాగల 24గంటల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబగద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి తెలికపాటి వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కీసరలో 42.3మి.మి వర్షం కురిసింది. మీర్‌ఖాన్‌పేటలో 28, పుట్టపహడ్‌లో 21, గుండాలలో 19, రాచులూర్‌లో 18, మాగనూర్‌లో 14.3, ఖాజాగూడలో 13, గచ్చిబౌలిలో 13, జిన్నారంలో 11.8, కడ్తాల్‌లో 11.5, డోనూర్‌లో 11.3, హన్వాడలో 11, బోమరాస్‌పేటలో 10 మి.మి వర్షం కుసిరింది. రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News