- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించిన చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇక వీటి ప్రభావంతో ఏపితో పాటు తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు సైతం వీస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరట్వాడ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సుమారు 0.9 కి.మీల ఎత్తు వరకు ఇది కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -