హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రను తాకాయి. సోమవారం నాడు నాశిక్ ప్రాంతంలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలలోకి ప్రవేశించాయి.రుతుపవనాల ఉత్తర పరిమితి నాసిక్, నిజాబాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకూ ఉంది. కిందిస్థాయిలోని గాలులు పశ్చిమ నైరుతి దిశ నుండి తెలంగాణ వైపునకు వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తామని తెలిపింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిచింది. హైదరాబాద్ కు కూడా భారీ వర్ష సూచన చేసింది