Saturday, December 21, 2024

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. మూడ్రోజులు కురిసే చాన్స్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్టోబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాగా, కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. ఇక, ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News