Sunday, December 22, 2024

తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.రేపటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో మోస్తర నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మంగళవారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలతో రైతులకు భారీగా పంటనష్టం జరిగింది. ఇక, హైదరాబాద్ లో కుండపోత వాన పడింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మళ్లీ వానలు పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News