Wednesday, April 2, 2025

రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు పలు ప్రాంతాల్లో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.రేపు, ఎల్లుండి.. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News