- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వానలు పడొచ్చని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ‘అసని’ తుఫాను కాకినాడకు ఆగ్నేయ దిశలో 260 కిమీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుఫాను హెచ్చరిక కారణంగా విశాకపట్నం నుంచి అనేక విమాన సర్వీసులు రద్దయినట్లు ఆయా విమానసంస్థలు ప్రకటించాయి.
- Advertisement -