Sunday, January 12, 2025

తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

వర్ని : తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. రాష్ట్రానికి మూడు రోజులపాటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు పలు జిల్లాలో వానలు పడతాయని స్పష్టం చేశారు. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు మెరుపులుఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News