Wednesday, January 22, 2025

రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో వర్షం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతవరణకేంద్రం హెచ్చరించింది. బుధవారం కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. విదర్భ ప్రాంతం నుండి ద్రోణి మంగళవారం జార్ఖండ్ , ఇంటీరియర్ ఒరిస్తా, కోస్తా అంధ్రప్రదేశ్ , రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ సముద్ర మట్టానికి 0.9కి.మి ఎత్తువద్ద కొనసాగుతున్నట్టు తెలిపింది.

దీని ప్రభావంతో రాగల 48గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాలకు ప్రత్యేక సూచన చేసింది. రానున్న 24గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఆగ్నేయ దిశ నుండి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

40డీగ్రీలకు చేరిన అదిలాబాద్

రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మంగళవారం అదిలాబాద్‌లో అత్యధికంగా 40డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాచలంలో 37.6, హైదరాంబాద్‌లో 37.6, ఖమ్మంలో 37, మహబూబ్ నగర్‌లో 38.1, మెదక్‌లో 38, నల్లగొండలో 35, నిజామాబాద్‌లో 38.8, రామగుండంలో 37, హన్మకొండలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News