హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులపాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ వద్ద కేంద్రీకృతమై వున్న తీవ్ర తుఫాను (మిచౌంగ్ ) మంగళవారం మధ్యాన్నం 12నుంచి రెండు గంటల మధ్య బాపట్ల సమీపంలో దక్షిణ ఆంధ్ర తీరాన్ని దాటాక తుఫానుగా బలహీనపడిందని తెలిపింది.
ఆ తర్వాత ఈ తుఫాను ఉత్తరదిశలో కదిలి తీవ్ర వాయుగుండంగాను మారిందని, అయితే బుధవారం ఉదయం 5.30 గంటలకు వాయుగుండంగా బాలహీనపడి ఉత్తర తెలంగాణ , దానికి అనుకొనిఉన్న చత్తిస్‌గఢ్ ప్రాంతం లో కేందృకృతమీ ఉన్నట్టు తెలిపింది. ఉదయం 8.30 గంటలకు మరింత బాలహీనపడి బాగా గుర్తించబడిన అల్పపీడనంగా మారి దక్షిణ చత్తిస్‌గఢ్ , దక్షిణ ఒదిశా ప్రాంతంలో కేద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ప్రాంతంనుండి ఉత్తర తెలంగాణ మీదుగాదక్షిణతమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో క్రింది స్థాయిలోని గాలులు ఉత్తర దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపింది.. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు వెల్లడించింది.
రాగల 24గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, . గురువారం రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడఅక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో పొడి వాతవరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురు గాలులులతో (గాలి వేగం గంటకు 30-నుంచి 40 కి.మీ) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.