- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశల్ లో రానున్న 4 రోజుల పాటు.. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక, తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, కొన్ని చోట్ల మాత్రం ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
- Advertisement -