- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో కేరళ తీరంతోపాటు దానిని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం లక్షద్వీప్‌లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగా వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Rains likely hit Telangana for next 3 days
- Advertisement -