Monday, January 20, 2025

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ రుతుపవనాలు ఆదివారం కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతోపాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి -40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

రెండు రోజుల పాటు వడగాల్పులు
సోమ, మంగళవారాల్లో ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో, ఆదిలాబాద్. కుమురం భీం, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జిల్లాలో వర్షంతో పాటు వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News