Monday, January 20, 2025

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains likely to hit Telangana for next 2 days

మనతెలంగాణ/హైదరాబాద్: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్రానికి వాతావరణ కేంద్రం చల్లని కబురందించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు ఛత్తీస్‌ఘడ్ నుంచి కోస్తా తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rains likely to hit Telangana for next 2 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News