- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఉండొచ్చని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలపైనే రికార్డ్ కావడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
- Advertisement -