Wednesday, January 22, 2025

మేఘ సంకోచం

- Advertisement -
- Advertisement -

ఏరువాక పౌర్ణమి దాటినా జాడలేని వానలు
తొందరపడి విత్తనాలు వేయొద్దు: వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

మూడ్రోజులు వడగాల్పులు

ఏరువాక పున్నమి దాటింది..నైరుతి రుతుపవాల రాక మరింత ఆల స్యం అని భారత వాతావరణ విభాగం(ఐఎండి) నుంచి వెలువడుతున్న ప్రకటనలు వ్యవసాయరంగంలో గుబులు పుట్టిస్తున్నాయి. వాతావరణ మా ర్పులతో రాష్ట్రంలో అక్కడక్కడా అరకొరగా కురుస్తున్న వాన వడగాల్పులతో అవిరవుతున్నాయి. వానాకాలం సేద్యం పనులకు అవసరమై న వానలకోసం రైతులు చూస్తున్నారు. రు తు పవనాలు ఈ నెల 4న కేరళ రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు వా స్తవ రూపం దాల్చలేకపోయాయి. నైరుతి రుతుపనాల రాక మరో మూడు రోజలు జాప్యం జరిగే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పె రుగుతున్నందున రుతుపవనాల రాకకు పరిస్థితు లు కొంత అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

ఆగ్నేయ అరేబియా సముంద్రం నుండి మేఘాల విస్తరణ వేగం పెరిగిందని ఇవి కేరళ రాష్ట్రంలోకి ఈ నెల రెండో ప్రవేశించే అవకాశాలు మెరుగు పడుతున్నాయని వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాలను బట్టి కేరళ రాష్ట్రంలోకి నై రుతి రుతుపనలు ప్రవేశించాక ఇవి విస్తరిస్తూ ఈ నెల మూడవ వారానికి గాని రాయలసీమ మీదు గా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు లేవని అధికారులు అంచానా వేస్తున్నారు. వర్షాల ఆధారంగా సాగుచేసే పంటలు వేసుకునేందుకు రైతులు ఇప్పటికే విత్తనాలు సేకరించి పెట్టుకున్నా రు. వేసవి దుక్కులు పూర్తి చేసి నేల పదునెక్కితే గాని వానాకాలం పంటల సాగుకు విత్తనాలు వేసే పరిస్థితి లేదు. రైతులు అరకొర వర్షాలను నమ్ముకుని విలువైన విత్తనాలను నేలపాలు చేసుకోవద్దని ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేశారు. విత్తనాల ఖరీదు ఎంతైనప్పటికీ ఒకసారి వాటిని నష్టపోతే తిరిగి కొత్తగా విత్తనాలు లభించటం అంత సులువు కాదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నైరుతి రుతుపవాలు తెలంగాణలోకి ప్రవేశించి రాష్టమంతటికీ విస్తరించి వర్షాలు సమృద్దిగా కురిశాకే పొలంలో విత్తనాలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.

రాగల మూడు రోజలు వర్షాలు, వడగాల్పులు
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక వైపు వర్షాలు, మరోవైపు వడగాల్పుల హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దక్షిణ చత్తిస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 1.5కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి చత్తీస్‌గడ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకూ సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద కొనసాగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుముల ,మెరుపులు, గంటకు 40కి.మివేగంతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.అక్కడక్కడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మరోవైపు రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , వరంగల్ జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా కొమరంభీమ్ జిల్లా జంబుగలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూలూరుపాడులో 43.8,ముత్తారంలో 43.8, కొండాపూర్‌లో 43.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News