Thursday, January 23, 2025

రానున్న రెండ్రోజులు ఓ మోస్తరు వానలు

- Advertisement -
- Advertisement -

rain

హైదరాబాద్‌: తెలంగాణలో  రానున్న రెం డ్రోజులు తేలికపాటి నుంచి  ఓ మోస్తరు వానలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గడ్‌ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి తెలంగాణకు దూరంగా వెళ్లిందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 22.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News