Saturday, January 4, 2025

వర్షాకాలం.. వ్యాధుల గాలం

- Advertisement -
- Advertisement -

విష జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. వర్షాలకు ఇళ్ల చుట్టూ నీ రు చేరడం, దోమలు వ్యాప్తి చెందడంతో ప్రజలు జ్వరాలు, మలేరియా, డెంగ్యూ బారిన పడుతున్నారు. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, దగ్గు, జలుబు లక్షణాలతో ఆసుపత్రుల ముందు జనాలు క్యూ కడుతు న్నారు. వర్షాలు, వచ్చే డెంగ్యూ, మలే రియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యా ధికారులకు తగిన సూచనలు ఇవ్వడం, జిల్లాలలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. నివారణ చర్యలు చేపడుతూనే వ్యాధుల పట్ల ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నారు.

మలేరియా కంటే క్రమంగా డెంగీ కేసులే అధిక సంఖ్యలో నమోదవుతున్నట్లు తె లిసింది. డెంగ్యూ సోకిన వారిలో 85 శాతం మం దిలో లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు చెబు తున్నారు. కొందరిలో జ్వర లక్షణాలు కనిపిస్తుండ గా, మరికొందరిలో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జ లుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎక్క డ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతా నోత్పత్తి చేస్తుంటాయి. ఉదాహరణకు ఇంటి ఆవ రణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకర కాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లా ర్వా వృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతా ల్లో నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వై ద్యులు సూచిస్తున్నారు. ఇం టి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్లనే దోమలు వ్యాపించి, వాటి ద్వారా డెం గ్యూ, మలేరియా వంటి వ్యా ధులు సంక్రమి స్తాయని చెబుతున్నారు.

ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని, దోమలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాల కా రణంగా దోమలు ప్రబలుతుండటంతో డెం గ్యూ ప్రభావం ఎక్కు వగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రాంతాల్లో దోమల నివారణకు రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ తదితర చ ర్యలు చేపడుతోంది. ప్రతి ఆదివారం 10 ని మిషాల పా టు ఇంటి పరిసరాల పరిశుభ్రత కు కేటాయించేలా ఆరోగ్య శాఖ అవగాహన చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ స్వయంగా తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి పరిసరాలను పరి శు భ్రతకు కే టాయించాలని పిలుపునిచ్చారు. దోమలు చేరకుం డా తమ ఇళ్లతో పాటు ఇం టి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాం తాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అ ధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దోమలు చేరే అవకాశముంటుంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News