Wednesday, January 22, 2025

రాయపూర్ నుంచి హైదరాబాద్‌కు గ్రీన్‌ఫీల్డ్ రహదారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయపూర్ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాఫీగా సాగేందుకు నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా తెలంగాణలోని సుమారు 63 కిలోమీటర్ల మార్గాన్ని కేంద్రం మంజూరు చేసింది. దీనికి సుమారుగా రూ. 10,500 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. తెలంగాణలోని బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి వరకు నాలుగు వరుసలుగా ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోని అన్నారం నుంచి ఆసిఫాబాద్ జిల్లా వీరవెల్లి మీదుగా రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు ఈ రహదారి ఉంటుంది. ప్రస్తుతం మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు నాలుగు వరుసల రహదారి ఉంది.

రాజీవ్ రహదారిగా వ్యవహరించే కరీంనగర్ టు హైదరాబాద్ మార్గం ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉంది. దీనికి అనుసంధానంగా బెల్లంపల్లి వరకు జాతీయ రహదారుల ప్రమాణాల మేరకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిని గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా నిర్మించనున్నారు. ఈ మార్గాన్ని నిర్మించేందుకు టెండర్లను రెండు ప్యాకేజీలుగా ఆహ్వానించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. దీనికోసం సుమారు 1048 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఎక్కడా నివాస ప్రాంతాలు లేవని, సుమారు ఆరు కిలోమీటర్ల మేర అటవీ భూములు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News